Mohanlal: పుస్తకంగా మోహన్‌లాల్‌ జీవిత చరిత్ర.. పుట్టినరోజు నాడు గుడ్‌న్యూస్‌ చెప్పిన నటుడు

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: అరవైల్లోనూ కుర్ర హీరోలతో పోటీపడుతూ.. బాక్సాఫీస్‌ లెక్కల్లో రికార్డులు సృష్టిస్తున్నారు అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ (Mohanlal). వరుస సినిమాలతో మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త


చరిత్రను లిఖిస్తున్నారు. నేడు ఈ టాలెంటెడ్‌ హీరో 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా అభిమానులకు ఒక గుడ్‌న్యూస్‌ చెప్పారు. తన జీవిత చరిత్రను పుస్తకరూపంలో అందించనున్నట్లు తెలిపారు. దీనికి


సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ముఖరాగం (Mukharagam) పేరుతో తన జీవిత చరిత్ర పుస్తకం రానున్నట్లు మోహన్‌లాల్ తెలిపారు. ‘‘నా పుట్టినరోజు సందర్భంగా మీతో కొన్ని అద్భుతమైన విషయాలను


పంచుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలకు రచయిత భానుప్రకాశ్ అక్షరరూపం ఇచ్చారు. ‘ముఖరాగం’ పేరుతో ఈ పుస్తకం రానుంది. దీనికి మలయాళంలో నాకు అత్యంత ఇష్టమైన రచయిత వాసుదేవన్‌


నాయర్‌ ముందుమాట రాశారు. ఇందులో గత 47 సంవత్సరాల నా నట జీవితంలో జరిగిన ఎన్నో అంశాల గురించి వివరించారు. నా జీవిత చరిత్ర పుస్తకం రూపంలో (Mohanlal Biography) రావాలని ఎంతోమంది కలలు కన్నారు. అవి


ఇప్పుడు నిజమవుతున్నాయి. దాదాపు వెయ్యి పేజీల ఈ పుస్తకం డిసెంబర్‌ 25న విడుదల కానుంది’’ అని చెప్పారు. * కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ.. ఫొటోలు వైరల్‌ ఇక ఇందులో మోహన్‌లాల్‌ నటనా ప్రయాణంతో


పాటు.. ఆయన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి వివరించారు. నిర్మాత, బ్రాండ్‌ అంబాసిడర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌గా.. ఇలా మోహన్‌లాల్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి రాశారు. ఆయన కుటుంబ


చరిత్ర, బాల్యం, కెరీర్‌ ప్రారంభం, ఆయనలో స్ఫూర్తినింపిన వ్యక్తుల గురించి వివరించారు. 1960లో జన్మించిన మోహన్‌లాల్‌ 1978లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రయోగాత్మక చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు.


తన అద్భుతమైన నటనకు గాను ఐదుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. తన కెరీర్‌ గురించి మోహన్‌లాల్‌ పలు సందర్భాల్లో చెప్పిన విశేషాలివి.. * నలభై ఎనిమిదేళ్ల కెరీర్‌లో నేను సినిమాను ప్రేమించినంతగా


దేన్నీ ప్రేమించలేదు. ఒక సినిమా సెట్స్‌ మీద ఉండగానే నాలుగైదు చిత్రాలకు ఓకే చెబుతుంటా. ‘మరీ అంత రిస్క్‌ అవసరమా’ అంటుంటారు ఇంట్లో వాళ్లు. నిజానికి నాకు విశ్రాంతి తీసుకోవడం, ఖాళీగా ఉండటమంటే


అస్సలు నచ్చదు. * చిన్నప్పట్నుంచీ భారత సైన్యం అంటే ఎనలేని గౌరవం. అటువైపు వెళ్లకపోయినా సైనికుల జీవితాన్ని తెరమీద చూపాలనే ఉద్దేశంతో ‘కీర్తిచక్ర’, ‘కురుక్షేత్ర’ తదితర సినిమాలు తీశా. * నాకు


ఎన్టీఆర్, ఏఎన్నార్‌ అంటే చాలా గౌరవం. ఎన్టీఆర్‌ నటుడిగానూ, ముఖ్యమంత్రిగానూ ఆయా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. పేదల కోసం ఎంతో తపన పడ్డారు. ఏఎన్నార్‌తో ‘గాండీవం’ లో నటించడం ఓ గొప్ప అనుభూతి.


ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు వస్తే చాలామంది ‘గోరువంక వాలగానే గోకులానికి...’ పాటను గుర్తు చేసుకుంటారు.  * ఆ సమయంలో బాలకృష్ణ, ఏఎన్నార్‌లతో స్టెప్పులు వేసిన రోజులు కళ్లలో మెదులుతాయి.


------------------------- ప్రస్తుతం మోహన్‌లాల్‌ ‘కన్నప్ప’ సినిమాతో పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. జూన్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మోహన్‌లాల్‌ పుట్టినరోజు సందర్భంగా


టీమ్‌ ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ను పంచుకుంది. ఇందులో ఆయన ‘కిరాత’గా కనిపించనున్నారు.