Trump-putin: అనవసరంగా చంపేస్తున్నారు.. పుతిన్‌ది పిచ్చి ప్రవర్తన: ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు

feature-image

Play all audios:

Loading...

వాషింగ్టన్‌: కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. (Ukraine-Russia War) దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ


పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) స్పందిస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin)పై విరుచుకుపడ్డారు. ఆయన పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని


మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నమైనా.. రష్యా పతనానికి దారితీస్తుందని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘పుతిన్‌తో నాకు మంచి


సంబంధాలే ఉన్నాయి. కానీ కొన్ని సార్లు ఆయనకు ఏం అవుతుందో అర్థం కావట్లేదు. పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అవసరం లేకపోయినా చాలా మందిని చంపేస్తున్నారు. ఇక్కడ నేను కేవలం సైనికుల


గురించే మాట్లాడట్లేదు. కారణం లేకపోయినా ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన ఉక్రెయిన్‌ (Ukraine)లో కొంత భూభాగాన్ని కాదు.. ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని


కోరుకుంటున్నారు. ఆయన దృష్టిలో అది సరైనదే కావొచ్చు.. కానీ, అది రష్యా (Russia) పతనానికే దారితీస్తుంది’’ అని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. * ఉక్రెయిన్‌పై అతి పెద్ద గగనతల దాడి ఇక, ఉక్రెయిన్‌


అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీరుపైనా విమర్శలు గుప్పించారు. ‘‘జెలెన్‌స్కీ మాట్లాడే విధానం కూడా ఆయన దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ఆయన మాట్లాడే ప్రతి మాటా సమస్యలు సృష్టిస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు.


ఇకనైనా ఆపాలి. మూడేళ్ల క్రితం నేను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు. అసమర్థత, ద్వేషంతో మొదలైన ఈ ఉద్రిక్తతల జ్వాలలను ఆపేందుకు నేను ప్రయత్నిస్తున్నా’’ అని అమెరికా


అధ్యక్షుడు రాసుకొచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. మూడేళ్లుగా


జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ.. అమెరికా మౌనంగా ఉంటే అది పుతిన్‌ను మరింత


ఉత్సాహపర్చినట్లు అవుతుందని విమర్శించారు.