Marriage scams: బంగ్లాదేశ్‌ యువతులతో అక్రమ వివాహాలు మనకొద్దు: చైనా అడ్వైజరీ

feature-image

Play all audios:

Loading...

(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మ్యారేజ్‌ స్కామ్స్’ విషయంలో తమ పౌరులకు చైనా (China) హెచ్చరికలు జారీ చేసింది. పెళ్లి చేసుకోవడానికి ఆ దేశంలో యువతుల కొరత ఏర్పడటంతో దానిని


అధిగమించడానికి అక్రమమార్గంలో వివాహాలు చేసుకొంటున్నట్లు గుర్తించిన నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది. ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. (Marriage scams in Bangladesh) మోసపూరిత క్రాస్‌ బోర్డర్


డేటింగ్ వీడియోలు, సమాచారం, అనధికారిక మ్యాట్రిమోనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్‌ (Bangladesh)లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను హెచ్చరించింది. బంగ్లా యువతులతో అక్రమ వివాహాలు


వద్దని, అక్కడ పెళ్లిళ్లు చేసుకొనేముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. చైనాలో కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య తగ్గుముఖం పడుతూవస్తోంది. రోజురోజుకు ఉద్యోగావకాశాలు తగ్గుతుండటం,


ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే కుటుంబం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన, యువతుల సంఖ్య తగ్గుతుండటం వంటివి కారణమవుతున్నాయి. మరోపక్క దాదాపు మూడు కోట్లమంది యువకులకు జీవిత భాగస్వాములు దొరకని పరిస్థితి


నెలకొంది. * నన్ను షట్‌డౌన్‌ చేస్తావా.. నీ ‘సంబంధం’ బయటపెడతా! ఈ వివాహాల కోసం బంగ్లా యువతులను చైనాకు అక్రమరవాణా చేస్తున్నారని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. చట్ట విరుద్ధంగా ఈ పెళ్లిళ్ల తంతు


నడుస్తోందని, ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చని ఎంబసీ తన అడ్వైజరీలో పేర్కొంది. సరిహద్దు ఆవల లైంగిక సంబంధాలు, వివాహాల బాధితులు వెంటనే పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీకి ఫిర్యాదు చేయాలని


సూచించింది. ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటే.. మానవ అక్రమరవాణా కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బంగ్లా చట్టాల ప్రకారం.. మానవ అక్రమరవాణాకు పాల్పడి, దోషిగా తేలితే ఏడు


సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి యావజ్జీవ, మరణశిక్షలు కూడా ఉండొచ్చు. కొన్ని క్రిమినల్‌ నెట్‌వర్క్‌లు గతంలో ఆ దేశ యువతులను భారత్‌కు ట్రాఫికింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.


ఇలాంటి ఆరోపణలతో కొన్నేళ్ల కిందట ఢాకాలో 11 మందిని అరెస్టు చేశారు. యువతుల అక్రమ రవాణకు టిక్‌టాక్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగించారని అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి.