Peddi: ‘పెద్ది’ షూట్‌.. ఫొటోలు పంచుకున్న బుచ్చిబాబు

feature-image

Play all audios:

Loading...

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర అప్‌డేట్‌ను దర్శకుడు తాజాగా పంచుకున్నారు. ఇంటర్నెట్‌డెస్క్‌:


రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో


ఉంది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి బుచ్చిబాబు తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. చరణ్‌ - దివ్యేందులపై యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తున్నానని ఆయన చెప్పారు. ఈ మేరకు వారిద్దరితో


కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. షూటింగ్‌ ఎంతో ఉత్సాహంగా సాగుతుందన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరోవైపు, రామ్‌చరణ్‌ సైతం ఇవే ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.


రామ్‌చరణ్‌ 16వ చిత్రంగా ఇది సిద్ధమవుతోంది. జాన్వీకపూర్‌ కథానాయిక. ఇప్పటికే 30 శాతం షూటింగ్‌ పూర్తైనట్లు సమాచారం. ప్రస్తుతం నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ


మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సిద్ధమవుతుంది. శివ రాజ్‌కుమార్‌, జగపతి బాబు


కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.