Lic guinness record: ఎల్‌ఐసీ గిన్నిస్‌ ఫీట్.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాలసీల విక్రయం

feature-image

Play all audios:

Loading...

LIC Guinness record | దిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) అరుదైన ఘనతను సాధించింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలు విక్రయించి గిన్నిస్‌


వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 20న ఈ అరుదైన ఘనతను సాధించినట్లు ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. విస్తృతమైన ఏజెన్సీ నెట్‌వర్క్‌ కలిగిన తమ పనితీరును గిన్నిస్‌ వరల్డ్‌


రికార్డ్‌ గుర్తించిందని ఎల్‌ఐసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఏజెంట్లు ఈ ఏడాది జనవరి 20న 5,88,107 లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను జారీ చేసినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. బీమా చరిత్రలో 24 గంటల


వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే తొలిసారి. తమ ఏజెంట్లు తమదైన పనితీరుతో ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించారని ఎల్‌ఐసీ పేర్కొంది. ఇది తమ ఏజెంట్ల అవిశ్రాంత కృషి, అంకితభావానికి నిదర్శనమని


కొనియాడింది. ఎల్‌ఐసీ కస్టమర్లు, వారి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలనే లక్ష్యానికి నిబద్ధతగా నిలుస్తోందని తెలిపింది. ఎల్‌ఐసీ వ్యవస్థాపక దినోత్సవం అయిన జనవరి 20న ‘మ్యాడ్‌ మిలియన్‌ డే’ను


పురస్కరించకుని ఒక్కో ఏజెంట్‌ కనీసం ఒక్క పాలసీ అయినా పూర్తి చేయాలన్న ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ సిద్దార్థ మొహంతీ విజ్ఞప్తి మేరకు ఈ అరుదైన ఫీట్‌ను ఎల్‌ఐసీ సొంతం చేసుకుంది. ఈ అరుదైన మైలురాయిని సాధించడం


పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు.