Thudarum review: రివ్యూ: తుడరుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

feature-image

Play all audios:

Loading...

Thudarum Review Telugu || చిత్రం: తుడరుమ్‌; నటీనటులు: మోహన్‌లాల్‌, శోభన, ప్రకాశ్‌ వర్మ, బిను పప్పు, ఫర్హాన్‌ ఫాజిల్‌ తదితరులు; దర్శకత్వం: తరుణ్‌ మూర్తి; స్ట్రీమింగ్‌ వేదిక: జియో హాట్‌స్టార్‌


ప్రేక్షకులకు ఆద్యంతం థ్రిల్‌ పంచే చిత్రాల్లో క్రైమ్‌ థ్రిల్లర్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటివాటిలో లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘తుడరుమ్‌’ (Thudarum Movie). కేవలం రూ.28 కోట్లతో నిర్మించిన ఈ


మూవీ ఇప్పటివరకూ దాదాపు రూ.230 కోట్లకు పైగా వసూలుచేసింది. తాజాగా జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్ర కథేంటి? ఎలాంటి థ్రిల్‌ పంచింది? Thudarum story ||


షణ్ముగం అలియాస్‌ బెంజ్‌ (మోహన్‌లాల్‌) ట్యాక్సీ డ్రైవర్‌. భార్య లలిత (శోభన), ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తుంటాడు. గంజాయి కేసులో షణ్ముగం కారును పోలీసులు సీజ్‌ చేస్తారు. ఎన్ని రకాలుగా


ప్రయత్నించినా కారు ఇచ్చేందుకు ఎస్‌ఐ బెన్నీ (బిను పప్పు) అస్సలు ఒప్పుకోడు. అయితే, సీఐ జార్జ్‌ (ప్రకాశ్‌ వర్మ) మాత్రం బెంజ్‌ అడగ్గానే కారు తాళాలు ఇచ్చేస్తాడు. అయితే, తమని అడవిలో జరిగే ఓ జాతరకు


తీసుకెళ్లమని అడుగుతాడు. అక్కడికి వెళ్లాక బెంజ్‌కు ఓ ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. ఎలాగో దానినుంచి బయటపడి ఇంటికి తిరిగొచ్చేసరికి కొడుకు కనిపించకుండా పోతాడు. దీంతో షణ్ముగం పోలీసులకు ఫిర్యాదు


చేస్తాడు. కనపడకుండా పోయిన తన కుమారుడిని వెతికే క్రమంలో విస్తుపోయే విషయాలు బయటకొస్తాయి. అటు పోలీసులను, ఇటు బెంజ్‌ను విస్మయానికి గురిచేసిన విషయాలేంటి? అసలు బెంజ్‌ కుమారుడు ఏమయ్యాడు? అన్నది


తెరపై చూడాల్సిందే! Thudarum Review || మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అగ్ర కథానాయకుడు నటిస్తే ఒకలా.. కొత్త హీరో నటిస్తే మరోలా లెక్కలు వేసుకుని తీసే సినిమాలు తక్కువ. ఇందుకు


65ఏళ్ల మోహన్‌లాల్‌ మినహాయింపు ఏమీ కాదు. ఒకసారి ఎలివేషన్స్‌తో కూడిన‘ఎల్‌2: ఎంపురాన్‌’లో మాస్‌ హీరోగా కనిపిస్తే, ఆ వెంటనే ‘తుడరుమ్‌’లాంటి ఇద్దరు పిల్లలున్న కథలోనూ ఒదిగిపోయి ప్రేక్షకులకు


థ్రిల్‌ పంచుతారు. దర్శకుడు తరుణ్‌ మూర్తి ఎంచుకున్న ఈ కథ రొటీన్‌ క్రైమ్ థ్రిల్లరే అయినా, చివరివరకూ ప్రేక్షకుడికి ఉత్కంఠ పంచడంలో విజయం సాధించారు. అదే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని


అందుకునేలా చేసింది. ఆరంభ సన్నివేశాల్లోనే ట్యాక్సీ డ్రైవర్‌గా బెంజ్‌ జీవితం, అతడి కుటుంబం, స్నేహితులు ఇలా ప్రతి పాత్రను పరిచయం చేసుకుంటూ వెళ్లారు. బెంజ్‌ ప్రపంచాన్ని ప్రేక్షకుడికి


చూపించటానికి  కాస్త సమయం తీసుకున్నారనిపిస్తుంది. ఎప్పుడైతే బెంజ్‌ కారును పోలీసులు సీజ్‌ చేస్తారో అప్పటినుంచి కథలో అసలైన ఇంటెన్స్‌ డ్రామా మొదలవుతుంది. సీజ్‌ చేసిన కారును ఎస్సై బెన్నీ


ఇవ్వననడం, ఆ మరుసటిరోజే వచ్చి అడగ్గానే సీఐ జార్జ్‌ కారును ఇచ్చేయడం చూస్తే, పోలీసులు ఏదో కుట్ర చేస్తున్నారని ప్రేక్షకుడికి ఇట్టే అర్థమైపోతుంది. అయితే, అదేంటి? వాళ్ల బెంజ్‌ను ఎందుకు పావుగా


వాడుకుంటున్నారన్న విషయాలను మాత్రం చాలా తెలివిగా, ఆద్యంతం అలరించేలా ఆ సన్నివేశాలను తీర్చిదిద్దాడు దర్శకుడు. తన కుమారుడు కనిపించకుండా పోవడానికి పోలీసులే కారణమని తెలుసుకున్న తర్వాత కథ మొత్తం


ఒకవైపు థ్రిల్ పంచుతూనే మరోవైపు యాక్షన్‌ మోడ్‌లోకి మారిపోతుంది. ద్వితీయార్ధంలో కథకు సంబంధించి ఒక్కొక్కటిగా చిక్కుముడిని విప్పుకొంటూ తెరపై ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ వరకూ


బెంజ్‌ కుమారుడు కనిపించకుండా పోవడానికి గల కారణాన్ని హుక్‌ చేసిన విధానం ప్రేక్షకుడికి మంచి థ్రిల్‌ను పంచుతుంది.   Thudarum cast and crew || తెరపై ఎక్కడా మనకు మోహన్‌లాల్‌ కనిపించడు. కేవలం


బెంజ్‌ మాత్రమే కనిపిస్తాడు. కనిపించకుండా పోయిన కొడుకు కోసం ఓ తండ్రి పడే ఆవేదనను, పోలీసులపై తన ఆవేశాన్ని చాలా సన్నివేశాల్లో కంటితోనే పలికించారు. బాధ, కోపం, వేదన ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఆ


పాత్రలో పలికించారు. కేవలం మోహన్‌లాల్‌లాంటి నటుడు మాత్రమే ఇలాంటి పాత్రలు చేయగలడని మరోసారి నిరూపించారు. షణ్ముగం భార్య లలిత పాత్రలో శోభన మెప్పించారు. ప్రతినాయకుడి పాత్ర బలంగా ఉన్నప్పుడే కథ,


హీరో ఎలివేట్‌ అవుతారు. ఆ విషయంలో సీఐ జార్జ్‌గా ప్రకాశ్‌ వర్మ.. ఎస్సై బెన్నీగా బిను పప్పులకు నూటికి నూరు మార్కులు పడతాయి. ముఖ్యంగా ప్రకాశ్‌వర్మ నవ్వుతూనే క్రూరత్వం ప్రదర్శించే తీరు చూస్తే,


అతడు కనిపిస్తే ప్రేక్షకుడికే కొట్టాలనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. ఒక రెగ్యులర్‌ క్రైమ్‌ ఎలిమెంట్‌ను రెండున్నర గంటల పాటు హుక్‌ చేయడంలో దర్శకుడు తరుణ్‌ మూర్తి విజయం సాధించారు.


అయితే, ఆరంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, నిడివి సినిమాకు కాస్త మైనస్‌. ‘తుడరుమ్‌’ అంటే ఇది కొనసాగుతుంది అని అర్థం.. మరి ఈ సిరీస్‌ ఇలా కొనసాగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరం. కుటుంబంతో కలిసి


చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌వేదికగా తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది. * బలాలు * + మోహన్‌లాల్‌, ఇతర నటీనటులు * + దర్శకత్వం * + ద్వితీయార్ధం *


బలహీనతలు * - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు * - నిడివి * చివరిగా:  థ్రిల్‌ పంచే ‘తుడరుమ్‌’ (Thudarum Review) * గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి


వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!