Dil raju: ఏపీ డిప్యూటీ సీఎం అభిప్రాయం అభినందనీయం: దిల్‌ రాజు

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అభిప్రాయం అభినందనీయమని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు


(Dil Raju) అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమాహాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి, ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్‌ ధరల పెంపు


కోసం వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. వీటిపై స్పందిస్తూ దిల్‌ రాజు సోషల్‌ మీడియా వేదికగా


నోట్‌ విడుదల చేశారు. * థియేటర్లలో ధరల నియంత్రణకు చర్యలు.. బంద్‌ వెనుక శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌