Eng vs ind: ఇంగ్లాండ్‌ టూర్‌ మా అందరికీ పరీక్ష.. అతిపెద్ద సవాల్‌ అదే: శార్దూల్ ఠాకూర్

feature-image

Play all audios:

Loading...

టీమ్ఇండియా త్వరలో ఇంగ్లాండ్‌ పర్యటనకు (ENG vs IND) వెళ్లనుంది. జూన్‌ 20 నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ టూర్‌ గురించి భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాట్లాడాడు.


ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా త్వరలో ఇంగ్లాండ్‌ పర్యటనకు (ENG vs IND) వెళ్లనుంది. జూన్‌ 20 నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ


(Rohit Sharma) లేకుండా భారత జట్టు (Team India) బరిలోకి దిగుతోంది. ఇటీవల వీరిద్దరూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, రిషభ్‌ పంత్‌ను వైస్‌


కెప్టెన్‌గా నియమిస్తూ ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ టూర్‌


గురించి శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ రోహిత్, కోహ్లీ (Virat Kohli) రిటైర్మెంట్‌పై స్పందించాడు. ఈ ఫార్మాట్‌లో మునపటిలా జట్టుకు సహకారం అందించలేమని భావించి వారు రిటైర్మెంట్‌ తీసుకొని ఉండొచ్చని


అభిప్రాయపడ్డాడు. * 9 ఏళ్ల తర్వాత టాప్‌-2లోకి.. ప్లే ఆఫ్స్‌లో బెంగళూరు రికార్డు ఎలా ఉందంటే? ‘‘కోహ్లీ, రోహిత్ ఆటలో అత్యంత సీనియర్ వ్యక్తులు. అయితే, టెస్టులకు వీడ్కోలు పలకడం అనేది వారి


వ్యక్తిగతమైన నిర్ణయం. మునుపటిలా టెస్టుల్లో ఆడలేమని భావించి వారు రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. చుట్టూ సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పుడు చాలా రక్షణ ఉంటుంది. జట్టులో సీనియర్‌, జూనియర్ ఆటగాళ్ల


మేళవింపు ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం జట్టులో ఉన్న వాళ్లలో రవీంద్ర జడేజా అత్యంత అనుభవజ్ఞుడు. ఈ పర్యటన కొత్తగా నాయకత్వ బాధ్యతలు అందుకున్న వారితో పాటు అందరికీ పరీక్షగా నిలవనుంది.


ఇది సరికొత్త సవాలు. కానీ, మాకు ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు. యంగ్ ప్లేయర్స్‌ తమదైన ముద్ర వేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంగ్లాండ్‌లో వాతావరణమే అతిపెద్ద సవాలు అని భావిస్తున్నా.


అక్కడ ఒకే రోజే మూడు రకాల వాతావరణాలను చూడవచ్చు. అకస్మాత్తుగా చలేస్తుంది. కాసేపటికే సూర్యుడు బయటికి రావడంతో వాతావరణం వేడిగా మారుతుంది. మళ్లీ కొద్దిసేపటికే ఆకాశం మేఘావృతమై చినుకులు పడతాయి’ అని


శార్దూల్ ఠాకూర్ వివరించాడు.