
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: వెంకటేశ్ (Venkatesh), రానా (Rana Daggubati) కలిసి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. 2023లో వచ్చిన సీజన్-1 యూత్‌కు బాగా నచ్చినా, చాలా చోట్ల శ్రుతిమించిన శృంగార
సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉందన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందింది. తొలి సీజన్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు ‘రానా నాయుడు: సీజన్ 2’
(Rana Naidu Season 2) రూపొందిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల తేదీ ఖరారైంది. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 1కు వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి
తీసుకున్నట్టు వెంకటేశ్ గతంలో తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీజన్ 2లో బోల్డ్ కంటెంట్ తగ్గించినట్టు తెలిపారు. సీజన్ 1 కంటే సీజన్ 2కు మరింత ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశాభావం
వ్యక్తం చేశారు. ‘రానానాయుడు’ కథ ఇదీ.. బాలీవుడ్‌లో ఏ సెలబ్రిటీకి సమస్య వచ్చినా పరిష్కరించే ఏకైక వ్యక్తి రానా నాయుడు (రానా). భార్య, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆనందంగా గడుపుతుంటాడు. ఓ రోజు
జైలు నుంచి బయటకు వస్తాడు రానా తండ్రి నాగా నాయుడు (వెంకటేశ్). రానాకు తండ్రి అంటే పడదు. అతడి వల్ల తన కుటుంబంలో సమస్యలు వస్తాయని ఆందోళనగా ఉంటాడు. మరి, నాగా నాయుడు వచ్చిన తర్వాత రానా జీవితంలో
చోటు చేసుకున్న మార్పులేంటి? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?అసలు తండ్రీకొడుకుల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? నాగా నాయుడి కొడుకులైన తేజ్ నాయుడు (సుశాంత్ సింగ్), జఫ్ఫానాయుడు (అభిషేక్ బెనర్జీ)
పరిస్థితి ఏంటి? తదితర ఆసక్తికర అంశాలతో సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ ‘రానా నాయుడు 1’ రూపొందించారు.