Cathy chui: కోడలికి రూ. 2,200కోట్ల ఖరీదైన కానుకలు ఇచ్చిన మామ..

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాంకాంగ్ నటి, సామాజిక కార్యకర్త కేతీ చుయి తన మామయ్య నుంచి వేలకోట్ల రూపాయల ఖరీదైన కానుకలు అందుకున్నారు. మొత్తంగా వాటి విలువ 257 మిలియన్ డాలర్లు (USD)గా అంచనా. అంటే భారత


కరెన్సీలో దాదాపు రూ.2,209 కోట్లు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. హాంకాంగ్‌లో అత్యంత సంపన్నుల్లో రెండో వ్యక్తి లీ షావ్‌కీ (Lee Shau Kee). రియల్‌ఎస్టేట్ టైకూన్‌ అయిన ఆయన్ను


ఆసియా వారెన్‌ బఫెట్‌గా పిలిచేవారు. హెండర్సన్‌ ల్యాండ్ డెవలప్‌మెంట్‌ సంస్థలో మెజార్టీ వాటాదారు. ఈ ఏడాది మార్చి 17న ఆయన మరణించారు. అప్పుడు ఆయన వయసు 97ఏళ్లు. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. ఆ


సమయంలో ఆయనకు 29.2 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తిపాస్తులున్నాయి. * పాక్‌లో.. అప్పట్లో అయూబ్‌ ఖాన్‌.. ఇప్పుడు మునీర్‌.. ఒక్కటే తేడా! లీ షావ్‌కీ ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద


కుమారుడు పీటర్‌కు ముగ్గురు సంతానం కాగా.. వారంతా సరోగసీ ద్వారా జన్మించినట్లు సమాచారం. చిన్నకుమారుడు మార్టిన్‌ లీ సతీమణే కేతీ చుయి. ఆమె ఒక నటి. మార్టిన్‌లీతో 2006లో వివాహం జరిగింది. ఆమెకు


నలుగురు సంతానం. పెళ్లికి ముందువరకు నటిగా ఉన్న ఆమె.. ఆ తర్వాత సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మరింత గుర్తింపు పొందారు. వితరణలో ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆమె సేవలకుగానూ అనేక


అవార్డులు వరించాయి. లీ షావ్‌కీ మరణించే వరకు కోడలికి అనేక బహుమతులు ఇచ్చారు. మొత్తంగా 257 మిలియన్ డాలర్ల విలువైన కానుకలు ఇచ్చినట్లు అంచనా. వాటిలో ఒక యాచ్‌, ఒక విలాస భవనం, ఆమె నలుగురు పిల్లల


చదువు కోసం ఎడ్యుకేషన్ ఫండ్‌, మిలియన్ల డాలర్ల విలువైన భూమి ఇచ్చినట్లు తెలిసింది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి విలువైన కానుకలు అందించేవారట. 2015లో ఆమె చివరి బిడ్డ జన్మించిన సమయంలో తన


ఉద్యోగులకు భారీ నగదును లీ షావ్‌కీ బహుమతిగా ఇవ్వడం విశేషం. దాంతో ఆమె పేరు స్థానిక మీడియాలో ‘హండ్రెడ్ బిలియన్ డాటర్‌-ఇన్‌-లా’గా మారుమోగిపోయింది.