War 2: హృతిక్‌- ఎన్టీఆర్‌ల ‘వార్‌ 2’.. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఫస్ట్‌ పోస్టు

feature-image

Play all audios:

Loading...

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్‌ 2’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో అయాన్ ముఖర్జీ పోస్ట్‌ పెట్టారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీప్రియులు ఆసక్తిగా


ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘వార్‌ 2’ (WAR 2) ఒకటి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (NTR), హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ


నేపథ్యంలో దర్శకుడు తొలిసారి ఈ సినిమాపై పోస్టు పెట్టారు. నటీనటులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. * జయం రవితో బంధం.. కెనీషాకు హత్య బెదిరింపులు..! ‘‘మరికొన్ని వారాల్లో మా చిత్రం మీ ముందుకు


వస్తుంది. ఈ సినిమా గురించి మీకు ఆసక్తికర విషయాలు చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఈ సినిమాను రూపొందించడానికి నాలో స్ఫూర్తినింపిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఈ


స్క్రిప్ట్‌ వినగానే ఆశ్చర్యపోయాను. అదే ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రధాన కారణం. ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఈ సినిమా కథ గురించి అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. నా స్నేహితురాలు


కియారా అడ్వాణీ (Kiara Advani) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నా. ఆమె అద్భుతంగా నటించింది. అలాగే ఈ రెండు సంవత్సరాల్లో ఆదిత్య చోప్రా నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. హృతిక్‌


(Hrithik Roshan), ఎన్టీఆర్‌లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.