
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: హీరోని దృష్టిలో పెట్టుకుని సినిమా కథను రాసేవారు కొందరైతే.. కథకు సరిపోయే కథానాయకుడిని ఎంపిక చేసుకునేవారు మరికొందరు. ఈ రెండో జాబితాకి చెందినవారే దర్శకుడు వెట్రిమారన్
(Vetrimaaran). వాస్తవికతకు పెద్దపీట వేసే ఆయన సూర్య (Suriya)తో ఇప్పటికే ‘వాడివాసల్’ (Vaadivaasal) సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ మూవీ గురించి
మాట్లాడారు. ‘సూర్యతో మీరు ప్రకటించిన సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు నెలకొన్నాయి’ అని హోస్ట్ ప్రస్తావించగా దర్శకుడు స్పందించారు. ‘‘నేను సినిమాలు తెరకెక్కిస్తా. 100 శాతం అంకితభావంతో
పనిచేస్తా. అంతే తప్ప అంచనాలకు బాధ్యత వహించలేను (నవ్వుతూ). ఒకవేళ నా చిత్రాలు ఆడియన్స్ అంచనాలు అందుకుంటే ఆనందిస్తా’’ అని పేర్కొన్నారు. * విడుదలకు సిద్ధమైన సినిమాను ఆపేద్దామన్నారు.. కానీ:
విజయ్ దేవరకొండ దర్శకుడి పేరు చూసి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా? అన్న అంశంపై మాట్లాడుతూ.. ‘‘ఎప్పటి నుంచో డైరెక్టర్లకూ అభిమానులున్నారు. వారికీ ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం
పరిస్థితులు మారాయి. అగ్ర దర్శకుడు- స్టార్ హీరో కలిసి చేసినా సినిమా అయినా.. ట్రైలర్ చూశాకే ప్రేక్షకుడు ఓ నిర్ణయానికొస్తున్నాడు. సినిమాని విడుదల రోజే చూడాలా? ఓటీటీలోకి వచ్చినప్పుడు చూడాలా?
అనేది తేల్చుకుంటున్నాడు’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. జల్లికట్టు ఇతివృత్తంగా ‘వాడివాసల్’ తెరకెక్కనుంది. 2022లోనే ఈ సినిమా ప్రకటన వెలువడింది. నేపథ్యానికి సంబంధించిన గ్లింప్స్‌నూ విడుదల
చేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందని గతంలో రూమర్స్ వచ్చాయి. ‘విడుదల 2’ సినిమా తర్వాత తాను తెరకెక్కించేది ‘వాడివాసల్’నే అని ఆ సమయంలోనే వెట్రిమారన్ క్లారిటీ
ఇచ్చారు.