Belrise industries ipo: బెల్‌రైజ్‌ ఐపీఓకు క్రేజ్‌.. 41 రెట్ల స్పందన

feature-image

Play all audios:

Loading...

Belrise Industries IPO | దిల్లీ: ఆటోమోటివ్‌ విడిభాగాలు తయారుచేసే బెల్‌రైజ్‌ ఇండస్ట్రీస్‌ (Belrise Industries IPO) ఐపీఓకు విశేష స్పందన లభించింది. శుక్రవారం సబ్‌స్క్రిప్షన్‌ గడువు ముగిసే


సమయానికి 41.30 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ముఖ్యంగా ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన ఇందుకు దోహదపడింది. మొత్తం రూ.2,150 కోట్లు సమీకరించేందుకు 17,70,58,824 షేర్లు


అందుబాటులో ఉంచగా.. 7,31,30,36,542 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల కోటా ఏకంగా 108.35 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల


కోటా 38.33 రెట్ల సబ్‌స్క్రైబ్‌ అవ్వగా.. రిటైల్‌ పోర్షన్‌ 4.27 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. మంగళవారం రూ.645 కోట్లను యాంకర్ల ఇన్వెస్టర్ల నుంచి సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. పూర్తి


ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ఐపీఓకు వచ్చిన ఈ సంస్థ.. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.85-90గా నిర్ణయించింది.  ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.1618 కోట్లను రుణాల తిరిగి చెల్లింపులకు కంపెనీ


వినియోగించనుంది. ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ సంస్థ అయిన బెల్‌రైజ్‌.. టూవీలర్‌, త్రీవీలర్‌, ఫోర్‌వీలర్‌, కమర్షియల్‌, వ్యవసాయ వాహనాలకు సేఫ్టీ క్రిటికల్‌ సిస్టమ్స్‌, ఇంజినీరింగ్‌ సొల్యూషన్లను


అందిస్తోంది. బజాజ్‌ ఆటో, హోండా మోటార్‌ సైకిల్ స్కూటర్‌ ఇండియా, హీరో మోటోకార్ప్‌, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వంటి సంస్థలతో దీర్ఘకాలిక భాగస్వామ్యం కలిగిఉంది.