
Play all audios:
Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (04-06-2025) లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక
విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం. తారాబలం (జూన్ 5, తెల్లవారుజాము 03:35
వరకు). కృత్తిక (2, 3, 4 పాదాలు): జన్మ తార (అంత మంచిది కాదు). రోహిణి: పరమ మిత్ర తార (మంచిది). మృగశిర (1, 2 పాదాలు): మిత్ర తార (మంచిది). తారాబలం (జూన్ 5, తెల్లవారుజాము 03:35 తర్వాత). కృత్తిక
(2, 3, 4 పాదాలు): సంపత్తార (చాలా మంచిది). రోహిణి: జన్మ తార (అంత మంచిది కాదు), మృగశిర (1, 2 పాదాలు): పరమ మిత్ర తార (మంచిది). ఈవారం (01-06-2025 - 07-06-2025) అత్యంత శ్రేష్టమైన కాలం, విజయం
త్వరగా లభిస్తుంది. ధైర్యంగా పనులను ప్రారంభించండి, గుర్తింపు వస్తుంది. స్వల్ప ప్రయత్నంతో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు. గురుబలం గౌరవాన్ని పెంచుతుంది. ద్వాదశ శుక్ర యోగం వల్ల
ఖర్చులు ఉంటాయి. వ్యాపారంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి. శ్రీమహాలక్ష్మిని స్మరించండి.