
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూతురిగానే కాకుండా మోడల్, న్యూట్రిషనిస్ట్, తన సమాజ సేవతో ఎంతోమందికి సుపరిచితురాలయ్యారు సారా తెందూల్కర్ (Sara Tendulkar).
సోషల్‌మీడియాతో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. తన డైలీ రొటీన్ ఏవిధంగా సాగుతుందో ఇందులో చూపించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్
చేస్తూ ఆమె కనిపించారు. ఉదయం కాఫీతో తన దైనందిన జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. జిమ్, మేకప్, వర్క్ టైమ్, స్నేహితులతో కలిసి మట్టి పాత్రలు తయారు చేయడం, మధ్యాహ్న భోజనం, ఇంటి రెనోవేషన్ పనులు
చూసుకోవడం, తల్లితో కలిసి డిన్నర్‌కు వెళ్లడం వంటి పనులతో సమయాన్ని గడిపారు. ‘‘నా దినచర్యలో ఉండే గందరగోళం. కాఫీ, ప్రశాంతతతో నా రోజు సాగుతుందిలా’’ అని ఆమె రాసుకొచ్చారు. * ‘మీ మూవీలో విలన్‌గా
చేస్తా’ మోహన్‌బాబు రిక్వెస్ట్.. శివరాజ్‌కుమార్ ఆఫర్ ఇదే! సారా తెందూల్కర్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. తన తండ్రి నడుపుతోన్న స్వచ్ఛంద సంస్థ ‘సచిన్ తెందూల్కర్ ఫౌండేషన్’కు డైరెక్టర్‌గా
వ్యవహరిస్తున్నారు ఈ భామ. పేద పిల్లల ఆరోగ్య సంరక్షణకు పాటుపడుతూనే.. విద్య, ఆటల్లో వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఆమె మోడలింగ్‌లో శిక్షణ పొందారు. దీంతో ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టే అవకాశం
ఉందని కొంతమంది భావించారు. అయితే తనకు నటన అంటే ఇష్టం ఉండదని.. సినీ రంగంలోకి రావాలనే ఆలోచన తనకు ఏమాత్రం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తెలిపారు.