Realme pad 2: రియల్‌మీ నుంచి మరో ట్యాబ్లెట్... భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ

feature-image

Play all audios:

Loading...

Published by: Last Updated:July 20, 2023 6:47 PM IST REALME PAD 2 | వీకెండ్‌లో సినిమాలు చూసేందుకు లేదా ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి రియల్‌మీ నుంచి మరో ట్యాబ్లెట్


వచ్చేసింది. రియల్‌మీ ఇండియా నుంచి మరో ట్యాబ్లెట్ లాంఛ్ అయింది. రియల్‌మీ ప్యాడ్ 2 (Realme Pad 2) ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేసింది కంపెనీ. రియల్‌మీ సీ53 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ కొత్త ట్యాబ్లెట్‌ను


పరిచయం చేసింది. గతంలో రిలీజ్ చేసిన రియల్‌మీ ప్యాడ్‌కు (Realme Pad) ఇది అప్‌గ్రేడ్ వేరియంట్. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ స్పీకర్స్, 2కే డిస్‌ప్లే, 8,360mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ


ట్యాబ్లెట్ రూ.20,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ కావడం విశేషం. ఆఫర్స్‌తో కేవలం రూ.17,999 ధరకే ఈ ట్యాబ్లెట్ కొనొచ్చు. ఇప్పటికే రూ.20,000 లోపు సెగ్మెంట్‌లో ఉన్న ట్యాబ్లెట్స్‌కి రియల్‌మీ ప్యాడ్ 2


గట్టి పోటీ ఇవ్వనుంది. రియల్‌మీ ప్యాడ్ 2 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి. రియల్‌మీ ప్యాడ్ 2 రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ


ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ప్రీ-ఆర్డర్ చేసేవారికి రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు ప్రీ-ఆర్డర్ చేయొచ్చు. ఆగస్ట్ 1 మధ్యాహ్నం 12 గంటలకు సేల్


ప్రారంభం అవుతుంది. గ్రే, గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ , రియల్‌మీ వెబ్‌సైట్స్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. advertisement రియల్‌మీ ప్యాడ్ 2 స్పెసిఫికేషన్స్ రియల్‌మీ


ప్యాడ్ 2 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 11.5 అంగుళాల 2కే డిస్‌ప్లే ఉంది. బ్లూలైట్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.


8జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. మెమొరీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. advertisement రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌లో 8,360ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 33వాట్


ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4జీ, వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఫీచర్స్


ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. Location : Telangana Andhra Pradesh


First Published : July 20, 2023 6:47 PM IST Read More