
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా కొన్ని దృశ్యాలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. రష్యా
మీడియా ఈ క్లిప్‌ను పదేపదే ప్రసారం చేసింది. ఈ దంపతులు చిర్రుబుర్రులాటపై రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా వెటకారంగా స్పందించారు. ‘‘ప్రథమ మహిళ తన భర్త చెంపమీద మెల్లగా తట్టి
ఉత్సాహపరచాలనుకొంటే.. అనుకోకుండా చేయి వేగంగా వచ్చి ఉంటుందా..? కాలర్ సరిచేసే క్రమంలో పొరబాటున తన ప్రియమైన వ్యక్తి ముఖంపై చేయి తగిలిందా..? దీన్ని కవర్ చేయడానికి మెక్రాన్ సలహాదారులు
క్రెమ్లిన్ హస్తం ఉందంటారేమో..?’’ అని ఎద్దేవా చేశారు. ఈ క్లిప్‌పై మెక్రాన్ స్పందించారు. ఆ సందర్భాన్ని ప్రతి ఒక్కరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తమ మధ్య ఎలాంటి గొడవ లేదని, అది తమ మధ్య
జరిగిన సరదా సన్నివేశమని అన్నారు. దీని చుట్టూ స్టోరీలు అల్లడంపై మండిపడ్డారు. ‘‘ఆ వీడియోల్లో నేను ఒక టిష్యూ తీసుకున్నాను. ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా భార్యతో జోక్ చేశాను. ఇది మా మధ్య
ఎప్పుడూ జరిగేదే’’ అని వివరణ ఇచ్చారు. మెక్రాన్-బ్రిగెట్టా మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని సోమవారం ఫ్రెంచ్ మీడియాలో వార్తలొచ్చాయి. వారి విమానం ఆదివారం వియత్నాం రాజధాని హనోయ్‌లో దిగింది.
తలుపును ఒక అధికారి తెరచినప్పుడు మెక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మెక్రాన్‌ను నెట్టివేశాయి. ఆయన వెంటనే తలతిప్పి వెనక్కు జరిగారు.
ఈ దృశ్యం రికార్డు అవుతున్నట్లు గమనించి చిరునవ్వుతో చేయి ఊపారు. ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్ వేసుకుని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. భార్య చేతిని పట్టుకోవడానికి
మెక్రాన్ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. తరువాత ఇద్దరూ కలసి మెట్లు దిగి ఎర్ర తివాచీ మీద పక్కపక్కనే నడిచారు. ఇక 47 ఏళ్ల మెక్రాన్, 72 ఏళ్ల బ్రిగెట్టా ప్రేమకథ గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.