Subodh kumar goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ అరెస్ట్‌

feature-image

Play all audios:

Loading...

Subodh Kumar Goel | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూకో బ్యాంక్‌ (UCO Bank) మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ED) అరెస్టు చేసింది. కాన్‌కాస్ట్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌


లిమిటెడ్‌ (CSPL)కు రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఆయన్ని అదుపులోకి తీసుకుంది. * అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన జెన్‌ టెక్నాలజీస్‌ షేర్లు..


దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 4% జంప్‌ సుబోధ్‌ కుమార్ గోయల్‌ యూకో బ్యాంక్‌ సీఎండీగా ఉన్న సమయంలో సీఎస్‌పీఎల్‌కు పెద్దఎత్తున నిధుల్ని మంజూరుచేశారు. ఇలా మంజూరైన రూ.6,210.72 కోట్లను ఆ సంస్థ


దుర్వినియోగం చేసిందని సీబీఐ దర్యాప్తులో తేలింది. అయితే, రుణ మంజూరు విషయంలో గోయల్‌కు ముడుపులు అందినట్లు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆ నిధులు గోయల్‌, ఆయన కుటుంబానికి చెందిన షెల్‌


కంపెనీల్లోకి బదిలీ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగి అరెస్ట్‌ చేసింది. మే 17న గోయల్‌ను పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపర్చగా.. మే 21


వరకు ఈడీ కస్టడీకి కోర్డు అనుమతిచ్చింది.