
Play all audios:
Siddaramaiah: కమల్ హాసన్ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఆయనకు చరిత్ర గురించి తెలియదంటూ నటుడిపై విమర్శలు చేశారు. బెంగళూరు: కన్నడ భాషపై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్
(Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నటుడి తీరును కర్ణాటకలోని కాంగ్రెస్, భాజపా ముక్తకంఠంతో ఖండించాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కూడా దీనిపై
(Kannada Row) స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. కమల్ హాసన్‌కు చరిత్ర గురించి తెలియదంటూ విమర్శించారు. అసలేం జరిగిందంటే.. చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో శివరాజ్ కుమార్‌ను ఉద్దేశించి
కమల్ హాసన్ మాట్లాడారు. ‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది. అందుకే వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. దీంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై కర్ణాటక (Karnataka)
సీఎం సిద్ధరామయ్యను మీడియా ప్రశ్నించగా.. ‘‘కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్‌కు ఆ విషయాలన్నీ తెలియవనుకుంటా’’ అని ఎద్దేవా చేశారు. * కన్నడ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు.. భాజపా
ఆగ్రహం అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర స్పందిస్తూ.. మాతృభాషను ప్రేమించడం మంచిదే. కానీ.. ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదంటూ హితవు
పలికారు. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు నటుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కమల్ హాసన్ ఇంకా స్పందించలేదు. కాగా.. ఇటీవల కూడా కన్నడ-తమిళ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
ఉగాది పర్వదినం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన పోస్ట్ ఆ వివాదానికి దారితీసింది. తమను ఆయన ద్రవిడులుగా పేర్కొనడంతో కన్నడ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.