
Play all audios:
భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi) కుటుంబీకులపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం కలకలం రేపింది. సోఫియా ఖురేషీ అత్తింటిపై దాడి జరిగిందని ‘ఎక్స్’లో నకిలీ పోస్ట్
వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi) కుటుంబీకులపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం కలకలం రేపింది. సోఫియా ఖురేషీ అత్తింటిపై
దాడి జరిగిందని ‘ఎక్స్’లో నకిలీ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో సదరు ‘ఎక్స్’ ఖాతాదారుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘బెళగావిలోని కర్నల్ సోఫియా ఖురేషీ అత్తమామల ఇంటిపై
దాడి జరిగిందని ఓ ‘ఎక్స్’ ఖాతాలో నకిలీ పోస్టు బయటకు వచ్చింది. దీంతో అప్రమత్తమై వివరాలు సేకరించాం. ఆ ‘ఎక్స్’ ఖాతాదారుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశాం. ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసిన మరో
ఇద్దరిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ప్రస్తుతం వారి గుర్తింపు వివరాలను ఇంకా ధ్రువీకరించలేదు’’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. * తుర్కియే సంస్థపై వేటు.. ‘సెలెబి’ సెక్యూరిటీ క్లియరెన్స్
రద్దు కాగా సంబంధిత ప్రాంతంలో ఎటువంటి దాడి జరగలేదని.. కావాలనే సోషల్ మీడియాలో నకిలీ పోస్ట్ పెట్టినట్లు పోలీస్ సూపరింటెండెంట్ భీమశంకర్ గులేడ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘ఎక్స్’ ఖాతా నుంచి
ఆ పోస్ట్‌ను తొలగించగా.. అది కెనడాకు చెందిన ఎక్స్ అకౌంట్ అని పోలీసుల ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సోఫియా ఖురేషీ కుటుంబీకులపై నకిలీ పోస్టు పరిణామాల నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి జి.
పరమేశ్వర ఎస్పీకి పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘‘సోఫియా ఖురేషీ భర్తది బెళగావి. ఆమె అత్తామామల ఇల్లు ఇక్కడే ఉంది కావున నకిలీ పోస్ట్ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ఈ
మేరకు తదుపరి చర్యల కోసం కేంద్రప్రభుత్వానికి తెలియజేశాం. ఇలాంటి పోస్టులు చేయడం రాష్ట్రానికి, దేశానికి అవమానకరం’’ అని హోంమంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే.. ముందస్తు భద్రతా చర్యల కోసం సోఫియా ఖురేషీ
అత్తింటి వద్ద ఇద్దరు పోలీసులను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌తో పోరుకు సంబంధించి కర్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు పలు వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే.