Trains cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. 300 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే!

feature-image

Play all audios:

Loading...

Published by: Last Updated:September 03, 2023 3:22 PM IST ఇండియన్ రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. 300 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే


ప్రయాణాలు  చేసేవారికి అతి ముఖ్యమైన గమనిక. వివిధ కారణాలతో ఇటీవల తరచూ రైళ్లు రద్దవుతున్నాయి. ఈసారి ఏకంగా 300 రైళ్లు రద్దు కానుండటం విశేషం. ఇంకొన్ని రైళ్లు రూట్ మళ్లించనున్నారు. ఇంతపెద్దఎత్తున


రైళ్లు రద్దుకు కారణాలేంటో చూద్దాం. దేశంలో గత కొద్దికాలంగా తరచూ వివిధ కారణాలతో రైళ్లు రద్దవుతుండటంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే విజయవాడ పరిధిలో హైదరాబాద్, చెన్నై రైళ్లు రద్దవడంతో


సమస్య ఎదురైంది. ఈసారి నార్తర్న్ రైల్వే పరిధిలో ఏకంగా 300 రైళ్లు రద్దు కానున్నాయి. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ దేశ రాజధాని ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచం


నలుమూలల్నించి దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పలు మార్గాల్ని నిషేధించింది. ఢిల్లీలో అయితే దుకాణాలు, వ్యాపారాలు,


ఇతర సంస్థలు మూసివేయనున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు ఇప్పుడు తాజాగా రైళ్లు కూడా రద్దు చేశారు. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ మూడ్రోజులపాటు ఉత్తర రైల్వే పరిధిలో ఏకంగా 200 రైళ్లను పూర్తిగా


రద్దు చేశారు. > Keeping in view the security and other important arrangement for > prestigious #G20Summit 2023 in Delhi Area, Railways have made 'Train > Handling Plan' as


 under. The Passengers are requested to plan their > journey on the dates shown accordingly :- pic.twitter.com/UuGdA7MbwB > — Northern Railway (@RailwayNorthern) September 2, 2023


advertisement మరో 100 రైళ్లను మార్గం మళ్లిస్తున్నారు. కొన్ని రైళ్లు రీ షెడ్యూల్ అవుతున్నాయి. మరి కొన్ని రైళ్లు టెర్మినల్ ఛేంజ్ అవుతున్నాయి. ఉత్తర రైల్వే ఈ మేరకు ఏయే రైళ్లు రద్దయ్యాయి, ఏయే


రైళ్లు రూట్ మారుతున్నాయనే వివరాలతో జాబితా విడుదల చేసింది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ ఢిల్లీ ఇతర సమీప ప్రాంతాలకు వెళ్లే ఆలోచన లేదా రిజర్వేషన్ చేయించుకున్నవారు ఈ జాబితా చెక్ చేసుకోవాలి. Stay


updated with the latest news, Download the News18 App to stay updated! Location : Delhi,Delhi,Delhi First Published : September 03, 2023 2:27 PM IST Read More