China: అధికారులూ.. దుబారా వద్దు.. మద్యం, సిగరెట్‌ కట్‌: చైనా

feature-image

Play all audios:

Loading...

ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు తమ దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని చైనా ప్రభుత్వం తమ అధికారులను ఆదేశించింది.  ఇంటర్నెట్‌డెస్క్‌: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను


పునరుద్ధరించేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ప్రభుత్వంలోని అధికారులు ఖర్చులు తగ్గించుకోవాలని చైనా ప్రభుత్వం (China) ఆదేశించింది. ప్రయాణాలు, మద్యం, సిగరెట్ ఖర్చులు


తగ్గించుకునేలా ప్రణాళికలు వేసుకోవాలని పేర్కొంది. ఈమేరకు అక్కడి అధికారిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేతృత్వంలోని


ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా అక్కడి ప్రభుత్వ అధికారులతో పాటు, అధికార పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం ప్రయాణాలు, మద్యం, సిగరెట్‌, ఆహారం,


కార్యాలయాల అద్దెలు వంటివి తగ్గించుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ వనరులను ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని కోరింది. దుబారాను తగ్గించాలని పేర్కొంది. ఈ దుబారా ఖర్చులు


చేయడాన్ని సిగ్గుచేటు చర్యగా ప్రభుత్వం అభివర్ణించింది.  * భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు చైనా సైనిక సాయం చేసిందా..? స్పందించిన బీజింగ్‌ ఇటీవల కాలంలో స్థిరాస్తి విక్రయాలకు సంబంధించిన ఆదాయం


విషయంలో చైనా నష్టాలను చూస్తోంది. అంతేకాక స్థానిక ప్రభుత్వాలపై అప్పుల భారం కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలో అధికారులు చేసే ఖర్చులతో ఒత్తిడి పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. స్థానిక


ప్రభుత్వాల ఆర్థికవృద్ధిని మెరుగుపరచాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా అక్కడి అధికారులను ఖర్చులు తగ్గించుకోవాలని ఆదేశించింది.