China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

feature-image

Play all audios:

Loading...

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నెట్‌డెస్క్‌: విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా (USA) ప్రభుత్వం కఠిన


విధానాలను అమలుచేస్తుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల (Student Visa Interviews) షెడ్యులింగ్‌ను


తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చైనా (China) స్పందించింది.  చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్‌ అమెరికా చర్యలపై మాట్లాడారు. అంతర్జాతీయ విద్యార్థులతో సహా


చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరుతున్నామన్నారు. ఇరుదేశాల మధ్య విద్యాపరమైన విషయాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలని సూచించారు. చైనా


విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం సన్నద్ధమవుతుందని యూఎస్‌ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన చేశారు. పరిశోధనా రంగాల్లో చదువుకుంటున్న వారితో పాటు, చైనీస్‌


కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధాలు ఉన్న విద్యార్థుల వీసాలే లక్ష్యంగా ఈ రద్దు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే చైనా ఈమేరకు స్పందించింది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో


భారత్‌ తర్వాత స్థానం చైనాదే.  * చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం: అమెరికా ఇక, విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అగ్రరాజ్యం మరింత దృష్టిసారించింది. ఈక్రమంలోనే


ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వీసా


దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్‌లైన్‌ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే ‘సోషల్‌ మీడియా వెట్టింగ్‌’ అంటారు. సంబంధిత విద్యార్థుల


సోషల్‌ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరుచేస్తారు. అప్పటివరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను నిలిపివేశారు.