Telangana news: 1990లో సర్టిఫికెట్‌.. 35 ఏళ్ల తర్వాత ఎస్టీ కాదని కలెక్టర్‌ ఉత్తర్వులు

feature-image

Play all audios:

Loading...

చవాన్‌ దేవానంద్‌ అనే రాజకీయ నేత ఎస్టీ కాదని 35 ఏళ్ల తర్వాత కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షిషా ఆదిలాబాద్‌: మాజీ ఎంపీటీసీ చవాన్‌


దేవానంద్‌ ఎస్టీ కాదని 35 ఏళ్ల తర్వాత కలెక్టర్‌ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఇచ్చోడకు చెందిన ఆ నేత ఎస్టీ కులస్థుడు కాదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1990లో


దేవానంద్‌ ఎస్టీ సర్టిఫికెట్‌ పొందారు. ఆయన కుమార్తెలు ఈ రిజర్వేషన్‌తో 2 సార్లు సర్పంచిగా పోటీ చేసి గెలిచారు. 2014లో దేవానంద్‌ రిజర్వుడ్‌ స్థానంలో ఎంపీటీసీగా గెలిచారు. ఆయన కులంపై కమిషన్‌కు


బంజారా సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో విచారణలో ఎస్టీ కాదని తేలడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులను కలెక్టర్‌ జారీ చేశారు. (Telangana News)