
Play all audios:
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితనమైన భారతీయ సినిమా ‘హోమ్‌బౌండ్’ ప్రశంసలు దక్కించుకుంది. జాన్వీకపూర్, ఇషాన్ కట్టర్ నటించిన చిత్రమిది. ఇంటర్నెట్ డెస్క్: జాన్వీ కపూర్ (Janhvi
Kapoor), ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హోమ్‌బౌండ్’ (Homebound). ప్రస్తుతం జరుగుతున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival 2025)లో ఈ చిత్రాన్ని
ప్రదర్శించారు. ఆ మూవీకి అతిథుల నుంచి మంచి స్పందన దక్కింది. సినిమా ప్రదర్శన పూర్తయిన వెంటనే వారంతా నిల్చొని 9 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. దీంతో, ‘హోమ్‌బౌండ్’
టీమ్ భావోద్వేగానికి గురైంది. సంబంధిత వీడియోను నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. * కేన్స్‌లో మెరిసిన జాన్వీకపూర్.. వీడియో వైరల్ కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ
చిత్రమిదే. ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ఈ మూవీ ప్రదర్శితమైంది. ఈ సినిమాని నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు. విశాల్ జెత్వా మరో కీలక పాత్రధారి. బాల్య స్నేహితులైన ఇద్దరు యువకులు పోలీసు
ఉద్యోగం సాధించాలనుకుంటారు. లక్ష్యానికి దగ్గరగా వెళ్లే కొద్దీ తమ మధ్య ఎందుకు దూరం పెరిగిందనే అంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ ఫెస్టివల్‌కు జాన్వీ హాజరుకావడం ఇదే తొలిసారి. బుధవారం ఉదయం.. రెడ్
కార్పెట్‌పై హొయలొలికించారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.