Zen technologies- divis labs: అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన జెన్‌ టెక్నాలజీస్‌ షేర్లు.. దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 4% జంప్‌

feature-image

Play all audios:

Loading...

Zen Technologies- Divis Labs: జెన్‌ టెక్నాలజీస్ షేర్లు నేడు ట్రేడింగ్‌ సెషన్‌లో అప్పర్‌ సర్క్యూట్‌ తాకాయి. దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 4 శాతం లాభపడ్డాయి. Zen Technologies- Divis Labs: రక్షణ రంగ


ఉత్పత్తుల సంస్థ జెన్‌ టెక్నాలజీస్‌ (Zen Technologies) షేర్లు నేడు ట్రేడింగ్‌ సెషన్‌లో రాణించాయి. ఎన్‌ఎస్ఈలో ఒక్కో షేరు 5 శాతం పెరిగి రూ.1,884.50 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. గత


ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తాజా ఫలితాల్లో వెల్లడించింది. దీంతో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ తాకాయి. గత ఆర్థిక


సంవత్సరం జనవరి-మార్చి మధ్య కాలంలో రూ.349.74 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నమోదైన రూ.144.04 కోట్లతో పోలిస్తే ఏకంగా 129.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర


లాభం రూ.37.58 కోట్ల నుంచి రూ.113.74 కోట్లకు చేరింది. మొత్తం ఆర్థిక సంవత్సరం(2024-25)లో ఆదాయం రూ.1032.02 కోట్లు, నికర లాభం రూ.299.33 కోట్లుగా ఉన్నాయి. * స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు భళా దివీస్‌


ల్యాబ్స్‌ షేర్లు 5% జంప్‌ ప్రముఖ ఔషధ కంపెనీ దివీస్‌ లెబొరేటరీస్‌ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. దీంతో సోమవారం ట్రేడింగ్‌ సెషన్‌లో షేర్లు రాణిస్తున్నాయి. ఫలితాలకు


తోడు బ్రోకరేజీ సంస్థలు మెరుగైన రేటింగ్‌ను అందిస్తుండటంలో షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో షేర్లు 5.72 శాతం లాభంతో రూ.6,635 వద్ద


ట్రేడవుతోంది. గత వారంలో 6 శాతం రాణించిన షేర్లు నేడు ఏకంగా 5 శాతం మేర పుంజుకున్నాయి.