
Play all audios:
Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (02-06-2025) మీరు బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం.
ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది. తారాబలం: రాత్రి 11:00వరకు ధనిష్ఠకు సాధక తార (చాలా మంచిది), శతభిషకు ప్రత్యారి తార (అంత మంచిది కాదు), పూర్వాభాద్రకు
క్షేమ తార (మంచిది). రాత్రి 11:00తర్వాత ధనిష్ఠకు నైధన తార (చాలా చెడ్డది), శతభిషకు సాధక తార (చాలా మంచిది), పూర్వాభాద్రకు ప్రత్యారి తార (అంత మంచిది కాదు). ఈవారం (01-06-2025 - 07-06-2025) మంచి
ఫలితాలు సాధిస్తారు. మీ తెలివితేటలు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారపరంగా అభివృద్ధి, నూతన ప్రయత్నాలు సఫలం. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. ఆర్థికంగా కలిసి వస్తుంది, ధనాన్ని వృద్ధి
చేసుకునే వీలు కలుగుతుంది. ఏలినాటి శని ప్రభావం కొంత ఉంది. శ్రీలక్ష్మీ అష్టోత్తరం చదవడం శుభప్రదం.