
Play all audios:
Published by: Last Updated:May 15, 2024 5:01 PM IST ఇండియన్ రైల్వేస్ స్లీపర్ క్లాస్‌లో అందించే బెడ్ షీట్లు, దిండు కవర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇందుకు
కారణాలు తెలుసుకోండి. Indian Railways: మన దేశంలో కోట్ల మంది ప్రజల ప్రయాణ, రవాణా అవసరాలను తీర్చడంలో రైల్వే నెట్‌వర్క్ కీలకపాత్ర పోషిస్తోంది. రోజువారీ అవసరాలు, సుదీర్ఘ ప్రయాణాలకు చాలా మంది
రైళ్లలోనే ప్రయాణిస్తారు. రైల్వేశాఖ ప్రయాణికులకు అతి తక్కువ ఖర్చుతో మంచి సేవలు అందిస్తోంది. అందుబాటులో టికెట్ ధరలు, సౌకర్యాలు, మంచి భద్రత అందిస్తుండటంతో రైళ్లు, ప్రజల మొదటి ట్రావెల్
ఆప్షన్‌గా మారాయి. రైళ్లలో చాలా ప్రయాణ తరగతులు ఉంటాయి. జనరల్ బోగీలు, స్లీపర్ క్లాస్, వన్ టైర్, టూ టైర్, త్రీ టైర్ ఏసీ బోగీలు ఉంటాయి. సదుపాయాలను బట్టి ధరలు మారుతాయి.ఇవి పక్కన పెడితే,
ఏదో ఒక సమయంలో, మనలో చాలామంది ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్‌మెంట్లలో రైల్వేశాఖ బెడ్‌రోల్స్‌తో అందించిన బెడ్‌షీట్లు ఉపయోగించే ఉంటారు. ఈ బెడ్‌రోల్స్, పిల్లో కవర్లను రోజూ ఉతికి, ప్రతి ప్రయాణికుడికి
తాజాగా ఇస్తారు. అయితే ఇండియన్ రైల్వేస్ ఇలా స్లీపర్ క్లాస్‌లో అందించే బెడ్ షీట్లు, దిండు కవర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇందుకు కారణాలు తెలుసుకోండి.* భారీ
సంఖ్యలో బెడ్‌షీట్లు అవసరంఇది రైల్వేశాఖ ర్యాండమ్‌గా తీసుకొన్న నిర్ణయం కాదు. బెడ్ షీట్లు, పిల్లో కవర్లు వైట్‌గానే ఉండటం వెనుక రైల్వేశాఖ వ్యూహం ఉంది. ఇండియన్ రైల్వేస్ ప్రతిరోజూ అనేక సంఖ్యలో
రైళ్లను నడుపుతుంది. కొన్ని వేల బెడ్‌షీట్లు, పిల్లో కేసులను ఉపయోగించాల్సి వస్తుంది. వీటిని సమయానికి ప్రయాణికులకు అందజేయాల్సి వస్తుంది. ఒక్కసారి వాడిన తర్వాత వాటిని సేకరించి శుభ్రం చేసి, మళ్లీ
ప్రయాణికులకు అందజేస్తారు. ఇవి పక్కన పెడితే, ఏదో ఒక సమయంలో, మనలో చాలామంది ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్‌మెంట్లలో రైల్వేశాఖ బెడ్‌రోల్స్‌తో అందించిన బెడ్‌షీట్లు ఉపయోగించే ఉంటారు. ఈ బెడ్‌రోల్స్,
పిల్లో కవర్లను రోజూ ఉతికి, ప్రతి ప్రయాణికుడికి తాజాగా ఇస్తారు. అయితే ఇండియన్ రైల్వేస్ ఇలా స్లీపర్ క్లాస్‌లో అందించే బెడ్ షీట్లు, దిండు కవర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయనే డౌట్ మీకు
ఎప్పుడైనా వచ్చిందా? ఇందుకు కారణాలు తెలుసుకోండి. * భారీ సంఖ్యలో బెడ్‌షీట్లు అవసరం advertisement ఇది రైల్వేశాఖ ర్యాండమ్‌గా తీసుకొన్న నిర్ణయం కాదు. బెడ్ షీట్లు, పిల్లో కవర్లు వైట్‌గానే ఉండటం
వెనుక రైల్వేశాఖ వ్యూహం ఉంది. ఇండియన్ రైల్వేస్ ప్రతిరోజూ అనేక సంఖ్యలో రైళ్లను నడుపుతుంది. కొన్ని వేల బెడ్‌షీట్లు, పిల్లో కేసులను ఉపయోగించాల్సి వస్తుంది. వీటిని సమయానికి ప్రయాణికులకు
అందజేయాల్సి వస్తుంది. ఒక్కసారి వాడిన తర్వాత వాటిని సేకరించి శుభ్రం చేసి, మళ్లీ ప్రయాణికులకు అందజేస్తారు. * అసలు కారణం.. వాషింగ్ ప్రాసెస్ advertisement పెద్ద సంఖ్యలో బెడ్‌షీట్లను, పిల్లో
కవర్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు. 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిని ఉత్పత్తి చేసే పెద్ద బాయిలర్లతో కూడిన ప్రత్యేక యంత్రాలు ఉంటాయి. బెడ్‌షీట్‌లను ఈ ఆవిరిలో
30 నిమిషాల పాటు ఉంచుతారు. దీంతో అవి పూర్తిగా క్రిమిరహితంగా మారుతాయి. ఈ శుభ్రపరిచే ప్రక్రియ కారణంగానే రైల్వేశాఖ కలర్ బెడ్ షీట్ల కంటే తెల్లటి బెడ్ షీట్లను ఎంపిక చేసుకుంది. ఎందుకంటే స్ట్రాంగ్
వాషింగ్ కండిషన్లకు వైట్ బెడ్‌షీట్లు మరింత అనుకూలంగా ఉంటాయి. అవి బ్లీచింగ్‌కి కూడా బాగా రెస్పాండ్ అవుతాయి. పరిశుభ్రత కోసం బ్లీచింగ్ చేయడం అవసరం. advertisement * కలర్ బెడ్‌షీట్లతో ఇబ్బందులు
అధిక ఉష్ణోగ్రతలు, బలమైన డిటర్జెంట్లను వాడటం వల్ల రంగు దుస్తుల కలర్ షేడ్ అవుతుంది. అవి చూడటానికి కూడా బాగుండవు. కానీ తెల్లని బెడ్ షీట్లను సరిగా బ్లీచ్ చేయవచ్చు. అవి మెరుపును కోల్పోవు. పదేపదే
ఉతికినప్పటికీ ఫాబ్రిక్ శుభ్రమైన, మెరిసే రూపాన్ని ఇస్తుంది. ఇవి ట్రావెలర్స్‌కు అందించినప్పుడు శుభ్రంగా ఉండటమే కాకుండా, ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. అంతే కాదు, వివిధ రంగుల బెడ్‌షీట్‌లు
వినియోగిస్తే, వాష్ చేసేటప్పుడు రంగులు కలవకుండా, వాటిని వేర్వేరుగా శుభ్రం చేయాల్సి వస్తుంది. ఒకే కలర్‌లో ఉండే బెడ్‌షీట్లను, పిల్లో కవర్‌లు ప్రత్యేకంగా వేరు చేసి వాష్ చేయాల్సి వస్తుంది.
Location : Hyderabad,Telangana First Published : May 15, 2024 5:01 PM IST Read More