Allu arjun: ‘గద్దర్‌ అవార్డ్స్‌’: తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు

feature-image

Play all audios:

Loading...

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) కృతజ్ఞతలు తెలిపారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ అవార్డుల్లో (gaddar awards) ఆయన ఉత్తమ నటుడిగా


ఎంపికయ్యారు. ‘పుష్ప2’లో నటనకు గానూ బన్నిని ఈ అవార్డు వరించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. > ‘‘తొలిసారి ప్రకటించిన > ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ > అవార్డ్స్‌ 


2024’లో ఉత్తమ > నటుడి అవార్డుకు ఎంపికవడం > నాకు దక్కిన నిజమైన గౌరవం. > ఇందుకు తెలంగాణ > ప్రభుత్వానికి > హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ > ప్రశంసలన్నీ దర్శకుడు > సుకుమార్‌, చిత్ర


> నిర్మాతలు, మొత్తం పుష్ప > టీమ్‌కు దక్కుతాయి. ఈ > అవార్డును నా అభిమానులకు > అంకితం చేస్తున్నా. మీరు > అందిస్తున్న సహకారం > ప్రతిసారి నాలో > స్ఫూర్తినింపుతుంది’’ > 


-ఎక్స్‌లో అల్లు అర్జున్‌ మరో హీరో ఎన్టీఆర్‌ కూడా ఈ అవార్డులపై స్పందించారు. ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024’ విజేతలకు అభినందనలు తెలిపారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేలా అవార్డులను


అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.  ‘దేవర’లో నృత్యాలు సమకూర్చిన గణేశ్‌ ఆచార్య ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపికవడంపైనా ఆయనకు శుభాకాంక్షలు


తెలిపారు.