Jaishankar: అణ్వస్త్ర బెదిరింపులకు వ్యతిరేకం: కేంద్రమంత్రి జైశంకర్‌

feature-image

Play all audios:

Loading...

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆపరేషన్‌ సిందూర్‌పై ఆస్ట్రియా విదేశాంగశాఖ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌తో ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ఫోన్‌లో చర్చలు జరిపారు. Operation Sindoor ||


ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్‌పై భారత్‌ ఇప్పటికే దౌత్య చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాయాది (Pakistan)పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత్‌


సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్రం పలు దేశాల రాయబారులు, విదేశాంగమంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్‌ ఇస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (Jaishankar) ఆపరేషన్‌ సిందూర్‌పై


ఆస్ట్రియా (Austria) విదేశాంగశాఖ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌ (BMeinl)తో ఫోన్‌లో చర్చలు జరిపారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడుల గురించి మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని భారత్‌ ఏమాత్రం


సహించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి, అణ్వస్త్ర బెదిరింపులకు వ్యతిరేకమనే అంశాలపై ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు జైశంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య


కొనసాగుతున్న యుద్ధం గురించీ తాము చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం జైశంకర్‌ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌ ఉగ్రవాదాన్ని ఏ


మాత్రం సహించదని వారికి తెలియజేశారు. ఇతర ప్రపంచ దేశాల ప్రతినిధులతో చర్చించారు. పాక్‌పై మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి.. మద్దతు కొనసాగించాలని కోరారు. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)


అనంతరం పాక్‌పై భారత్‌ చేపట్టిన చర్యల గురించి చైనా, అమెరికా, జపాన్‌, జర్మనీ, యూకే, రష్యా వంటి 70 దేశాల దౌత్యాధికారులకు భారత్‌ వివరించింది. ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌ (India) వేసిన ముందడుగు,


అనంతరం చోటుచేసుకున్న పరిణామాల వివరాలను వారికి తెలియజేసింది.