Operation sindoor: భారత్ - పాక్‌ ఉద్రిక్తత.. మీ ఫోన్లలో ‘ఎమర్జెన్సీ అలర్ట్స్‌’ పెట్టుకున్నారా?

feature-image

Play all audios:

Loading...

Operation Sindoor: పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలకు భారత ఆర్మీ సరైన సమాధానం ఇస్తోంది. అయితే, సాధారణ పౌరులను ప్రత్యర్థి లక్ష్యంగా చేసుకోవడంతో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటోంది.


   ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పహల్గాంలో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు 26 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి


తెలిసిందే. దీంతో పాక్‌లోని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు చేసింది. పాకిస్థాన్‌ మాత్రం సాధారణ పౌరులు, ఇండియన్ ఆర్మీని లక్ష్యంగా దాడులు


మొదలుపెట్టింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను హెచ్చరిస్తూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇంతవరకు వీధుల్లో తిరుగుతూ ప్రకటనలు చేయడం చూశాం కదా.. అయితే, ఇప్పుడు నేరుగా ఫోన్లకే


ఇలాంటి సందేశాలూ వచ్చేలా చేశారు. నెట్‌వర్క్‌ సమస్యలు ఉన్నప్పుడూ మెసేజ్‌లు వచ్చే వెసులుబాటు ఉంది. వాటిని ఫాలో అయి సురక్షితమైన ప్రాంతాలకు చేరితే సరిపోతుంది.  * ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాద


శిబిరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసిందిలా సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు.. యుద్ధాలు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం వైర్‌లెస్‌


ఎమర్జెన్సీ అలర్ట్‌ వ్యవస్థను (Emergency Alert System) రూపొందించింది. ఆకస్మిక పరిస్థితుల్లో ప్రజలకు అలర్ట్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం చేరవేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించింది. ఇప్పుడు


పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్‌డేట్స్‌ మిస్‌ కాకుండా ఉండేందుకు ఫోన్లలో ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచించారు. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఈ వెసులుబాటు ఉంది. మీ ఫోన్లలో


అలర్ట్స్‌ డిజేబుల్‌ చేసి ఉంటే ఇప్పుడైనా ఎనేబుల్ చేసుకోవాలి. మరి అదెలా చేయాలో తెలుసుకుందాం.. ఆండ్రాయిడ్ యూజర్లు.. * ఫోన్‌లోని సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి * సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్‌ను


టాప్‌(TAP) చేయాలి. లేకపోతే ‘ఎమర్జెన్సీ అలర్ట్స్‌’ అని సెర్చ్‌బార్‌లో శోధించొచ్చు * వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను ఎంపిక చేయాలి * శామ్‌సంగ్, షియోమి, వన్‌ప్లస్.. పేర్లు భిన్నంగా ఉండొచ్చు.  *


అన్ని ఆప్షన్లను యాక్టివేట్‌ చేసుకోవాలి ఐఫోన్ యూజర్లు * సెట్టింగ్స్‌ యాప్‌ను ఓపెన్ చేయాలి * నోటిఫికేషన్స్‌కు వెళ్లాలి * గవర్నమెంట్ అలర్ట్స్‌ అని ఉంటుంది * కీలక అలర్ట్‌లు వచ్చేందుకు ఆప్షన్‌ను


ఆన్‌ చేయాలి * ఒక్కో ఎమర్జెన్సీ సమయంలో ఒక్కోలా అలర్ట్స్‌ వస్తుంటాయి