Rudranath temple: తెరుచుకున్న రుద్రనాథ్‌ ఆలయం.. దర్శించుకోవాలంటే 20కి. మీ. ట్రెక్కింగ్‌

feature-image

Play all audios:

Loading...

గోపేశ్వర్‌: పంచ కేదార్‌నాథ్‌ క్షేత్రాల్లో ఒకటైన ప్రపంచ ప్రఖ్యాత రుద్రనాథ్‌ ఆలయ(Rudranath temple) ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్‌ హిమాలయ ప్రాంతంలో శివుడు కొలువైన ఈ


దివ్యక్షేత్రాన్ని ఆదివారం భక్తుల కోసం తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. చమోలి జిల్లాలోని 11,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయంలో ఆదివారం ఉదయం సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ దివ్యక్షేత్రానికి


చేరుకొనేందుకు 20కి.మీల మేర కష్టతరమైన ట్రెక్కింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలయ ద్వారాలు తెరవడంతో వచ్చే ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా ఆ మహాదేవుడికి పూజలు కొనసాగనున్నాయి. ఏటా దేశ, విదేశాల


నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. మధ్యమహేశ్వర్‌, తుంగ్‌నాథ్‌, రుద్రనాథ్‌, కల్పేశ్వర్‌, కేదార్‌నాథ్‌లను పంచ కేదార్‌నాథ్‌ క్షేత్రాలుగా పేర్కొంటారు.