
Play all audios:
Infinix GT 30 Pro 5G | ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త గేమింగ్ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ జీటీ 30 ప్రో 5జీ (Infinix GT 30 Pro
5G) పేరిట భారత్‌లోకి తీసుకొచ్చింది. వెనకభాగంలో ఆకర్షణీయంగా సైబర్ మెచా 2.0 డిజైన్, ఎల్‌ఈడీ లైట్ ప్యానెల్‌తో దీన్ని విడుదల చేసింది. ఇన్‌ఫినిక్స్ కొత్త మొబైల్ 6.78 అంగుళాల 1.5కె అమోలెడ్
డిస్‌ప్లేతో వస్తోంది. 144Hz రిఫ్రెష్ రేటు, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిఉంటుంది. 4nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 15
ఆధారిత XOS 15 ఔటాఫ్ ది బాక్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఏఐ నోట్, ఫోలాక్స్, రైటింగ్ అసిస్టెంట్, సర్కిల్ టు సెర్చ్.. వంటి ఇన్‌ఫినిక్స్ ఏఐ సూట్ ఫీచర్లతో కొత్త మొబైల్‌ను తీసుకొచ్చారు. *
అదరగొట్టిన ప్రొస్ట్రామ్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు.. 19% ప్రీమియంతో లిస్టింగ్ ఇక్ కెమెరా విషయానికొస్తే.. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, సెల్ఫీ కోసం ముందువైపు 8 ఎంపీ
కెమెరాను అమర్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో వస్తోంది. 5,500mAh బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్ 45W వైర్డ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4,
యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. గేమ్ ఆడుతున్న సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఏఐ ఆధారిత వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. మెరుగైన గేమింగ్ అనుభవం
అందించేందుకు ఎక్స్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్ ఇచ్చారు. ఇన్‌ఫినిక్స్ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999గా కంపెనీ ప్రకటించింది. 12జీబీ +256జీబీ వేరియంట్
ధర రూ.26,999గా నిర్ణయించింది. బ్లేడ్ వైట్, డార్క్ ఫ్లేర్ రంగుల్లో లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా 8జీబీ వేరియంట్‌పై రూ.2వేలు తగ్గింపు ఇస్తోంది. జూన్ 12 నుంచి విక్రయాలు
ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్ వేదికగా కొనుగోలు చేయొచ్చు.