Epfo interest rate: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

feature-image

Play all audios:

Loading...

EPFO interest rate | దిల్లీ: ఈపీఎఫ్‌ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్‌ బోర్డు


ఆఫ్‌ ట్రస్టీస్‌ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై


చేసిన నేపథ్యంలో త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. బ్యాలెన్స్‌ చెక్‌ ఇలా.. * పీఎఫ్‌ వడ్డీ మీ అకౌంట్‌లో జమ అయ్యిందో లేదో చెక్‌ చేసుకోవడంతో పాటు ఖాతాలో నిల్వల వివరాల కోసం


ఉమాంగ్‌ యాప్‌ను సందర్శించొచ్చు. రిజస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అయ్యాక యాప్‌లో ఈపీఎఫ్‌ఓ సర్వీసెస్‌ విభాగంలోకి వెళితే యూఏఎన్‌, ఓటీపీ ఎంటర్‌ చేయాలి. ఆపై బ్యాలెన్స్‌, పాస్‌బుక్‌ వంటి


వివరాలు కనిపిస్తాయి. * ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌ WWW.EPFINDIA.GOV.IN వెబ్‌సైట్‌లోకి వెళ్లి యూఏఎన్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత మెంబర్‌ పాస్‌బుక్‌ను ఎంపిక చేసుకుని వివరాలు పొందొచ్చు. * మీ


రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ నుంచి 99660 44425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌కు కాల్ చేయగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది.


కాసేపటి తర్వాత  పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్సెమ్మెస్‌ రూపంలో వస్తుంది.  * ఎస్సెమ్మెస్‌ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నుంచి 77382 99899 నంబర్‌కు EPFOHO ‘UAN’ అని మెసేజ్


చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ పొందొచ్చు.